- Advertisement -
అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలోని విసన్నపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి నుంచి మామిడికాయల లోడుతో వస్తున్న ఓ లారీ విస్సన్నపేట సమీపంలో అదుపుతప్పడంతో వ్యక్తిని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని కగాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Man Killed in Road Accident in NTR District
- Advertisement -