Friday, December 20, 2024

బైక్ పైనుంచి కిందపడి వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని మేకగూడ గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మేకగూడ గ్రామానికి చెందిన రమేష్(28) స్థానికంగా ఉన్న ఎంఎస్‌ఎన్ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్నాడని, ఈ నేపథ్యంలో రోజుమాదిరిగానే విధులకు వెళ్లి తిరుగు ప్రయాణంలో గ్రామానికి వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడడంతో రమేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

చెవులు, ముక్కులోంచి రక్తం రావడంతో స్థానికుల సమాచారంతో రమేష్ కుటుంబ సభ్యులు చికిత్సకోసం ఉస్మానియాకు తరలించారు. అయితే, చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు మృతుని భార్య నవనీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రామయ్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News