Saturday, December 28, 2024

ప్రాణాలు తీస్తున్న భూతగాదాలు

- Advertisement -
- Advertisement -

కలకాలం అన్నా.. తమ్ముడు..అక్కా.. చెల్లి అనే బంధం బంధుత్వాలని పక్కన పెట్టి బంధాల కంటే భూములే ముఖ్యం అనే కోణంలో రోజురోజుకు సమాజంలో మానవత్వం మంట కలిసి పోతుందనడానికి భూతగాదాల హత్యలే కారణం. కాటారం మండలంలో గత కొన్నేళ్లుగా భూతగాదాల విషయంలో బంధాలను మరిచి హత్యలకు పాల్పడుతున్నారు. గతంలో గంగారంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని కల్లల్లో కారం పొడి చల్లి అతి కిరాతకంగా గొడ్డళ్ళతో నరికి చంపిన ఘటన తర్వాత ఇటీవల రేగులగూడెం గ్రామంలో ఐదు గుంటల భూమి వివాదంలో జరిగిన హత్య సంఘటనను మరువక ముందే కాటారం మండలకేంద్రంలో భూవివాదంలో జరిగిన హత్య సంచలనం రేకెత్తించింది. కాటారం మండలకేంద్రంలోని ఇప్పలగూడెంలో డొంగిరి బుచ్చయ్య(60) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పగూడెంకు చెందిన డొంగిరి బచ్చయ్య, సొదారి లింగయ్యకు వివాదంగా ఉన్న వ్యవసాయ భూమిపై రెండు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.

శుక్రవారం భూమి వద్దకు వెళ్లిన సొదారి లింగయ్య, లింగయ్య భార్య పద్మ, బుచ్చయ్యతో గొడవ పడ్డారు. కోపంతో బుచ్చయ్య అనే వ్యక్తి లింగయ్య భార్య పద్మపై తన చేతిలో ఉన్న పారతో దాడి చేశాడు. ఈ ఘటనలో పద్మకు తీవ్రగాయం కావడంతో లింగయ్య కుమారుడు సొదారి పవన్‌కు సమాచారం ఇచ్చాడు. పవన్ ఘటన స్థలానికి వస్తుండగా మార్గమధ్యలో బుచ్చయ్య ఎదురుపడ్డాడు. కోపోద్రిక్తుడైన పవన్ అక్కడే ఉన్న కర్రతో బుచ్చయ్య తలపై బాదాడు. బుచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాటారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగార్జున రావు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుకున్నారు. లింగయ్యకు, బుచ్చయ్యకు భూమి విషయమై గత కొన్నేళ్లుగా వివాదం ఉందని, ఎవరికి అట్టి భూమిపై తగిన రికార్డులు లేవని గతంలో గొడవలు పడగా ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. మృతుడు బుచ్చయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News