Monday, December 23, 2024

భార్య, నలుగురు పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తిరువణ్ణామలై: తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా చెంగం తాలూకాలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యుక్తవయస్కులైన ఇద్దరుకుమార్తెలతో సహా నలుగురుపిల్లలను, భార్యను చంపి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి కత్తిగాటు గాయాలతో మరో 19 ఏళ్ల కుమార్తె ఆసుపత్రిలో చేరింది. చెంగం సమీపంలోని హాడి గ్రామానికి చెందిన 45 ఏళ్ల పళనిసామి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దారుణం వెనుక కచ్ఛితమైన కారణం ఏమిటో తెలియరానప్పటికీ ఇరుఉగపొరుగువారు అనుమానంతో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగుచూసినట్లు పోలీసులు చెప్పారు. పళనిసామి ఇంటి సీలింగ్‌కు ఉరేసుకుని చనిపోగా 37 ఏళ్ల అతని భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు విగతజీవులై ఇంట్లో పడి ఉన్నారని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో స్పృహతప్పి పడిపోయి ఉన్న మరో 19 ఏళ్ల కుమార్తెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వారు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News