- Advertisement -
బెంగళూరు : తక్కువ కులం యువకుడ్ని ప్రేమించిన కన్నకూతురి గొంతు నులిమి తండ్రే చంపేశాడు. కర్ణాటక లోని పెరియపట్న తాలూకా కగ్గుండి గ్రామానికి చెందిన అగ్రకులం యువతి దళితుడిని ప్రేమించింది. దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు తీవ్రంగా హెచ్చరించారు. అయినా ఆమె లెక్కచేయక యువకుడితో ప్రేమసంబంధాలు కొనసాగించింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన తండ్రి తన 17 ఏళ్ల కూతుర్ని గొంతునులిమి చంపేశాడు. ఈ కేసులో నిందితుడ్ని మైసూర్ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.
- Advertisement -