Tuesday, December 24, 2024

అప్పు ఇచ్చి అడిగినందుకు అమ్మమ్మ హత్య

- Advertisement -
- Advertisement -

చెన్నై: అప్పు ఇచ్చిన డబ్బులు పలుమార్లు అడగడంతో అమ్మమ్మను మనవడు సుత్తితో కొట్టి చంపిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కుర్రుకుపేట సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాలక్ష్మి(90) అనే వృద్ధురాలు కురుమరియమ్మన్ నగర్‌లోని రెండో వీధిలో నివసిస్తోంది. విశాలక్ష్మికి కూతురు అముధా, మనవడు సతీష్(28) ఉన్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం తన కూతురు అముధాకు విశాలక్ష్మి లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది. తన కూతురు, మనవడిని డబ్బులు ఇవ్వాలని పలుమార్లు తల్లి అడిగింది. దీంతో ముగ్గురు మధ్య డబ్బులు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. విశాలక్ష్మి తన ఇష్టమైన చేపలు కూర వండుకొని తిని విశ్రాంతి తీసుకుంటుంది. ఇదే సమయంలో సతీష్‌ను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో అమ్మమ్మపై మనవడు బ్లేడ్‌తో దాడి చేశాడు. అనంతరం సుత్తి తీసుకొని అమ్మమ్మ తలపై బాదాడు. శబ్ధం వచ్చిందని పక్కింటి వారు అడగడంతో టివి నుంచి వచ్చిందని చెప్పాడు. అనంతరం అతడు టివి చూస్తూ అమ్మమ్మ గాయపడిందని తన తల్లికి పోన్ చేశాడు. వెంటనే ఆమె తన ఇంటికి వచ్చి తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సతీష్ అదుపులోకి తీసుకొని అడగగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News