Sunday, January 19, 2025

తల్లి, ఇద్దరు పిల్లలను చంపేసిన కిరాతకుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలంలో ఓ వ్యక్తి తన తల్లి, ఇద్దరు పిల్లలను చంపేసి పరారయ్యాడు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన తల్లి పోచ్చమ్మ(60), పిల్లలు నీరజ్(10), ఖుషీ(6)ను గోపాల్ పేట్ గ్రామంలో శుక్రవారం రాత్రి చంపేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు.

గ్రామస్థులు ఆ మహిళ, ఇద్దరు పిల్లలు కనిపించకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా వారు ఇంట్లో చచ్చిపడున్నారు. వెంకటేశ్వర్లు వారికి కనిపించలేదు.

సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎస్. సాగర్ ఆ ఇంటికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. శవాలను స్థానిక ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పంపారు. ఇదిలావుండగా రెండు నెలల క్రితం వెంకటేశ్వర్లు తన భార్యను చంపాడు. అప్పుడు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.  కాగా ఇప్పుడు మళ్లీ తల్లి, పిల్లలను వెంకటేశ్వర్లు ఎందుకు చంపాడన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంటి సమస్యల కారణంగా వెంకటేశ్వర్లు మతి చలించినట్లు ప్రవర్తిస్తున్నాడని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News