Monday, December 23, 2024

ఫోన్‌లో మాట్లాడుతున్నాడని మందలించిన భార్య… భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man kills self as wife breaks his phone

 

చెన్నై: ఫోన్‌లో పదే పదే మహిళతో మాట్లాడుతున్నాడని భర్తను భార్య మందలించినందుకు అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోన సుంగువచత్రమ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన క్రిష్ణ (22) అనే వ్యక్తి తమిళనాడులో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పూజా అనే అమ్మాయితో అతడికి పెళ్లి జరిగింది. ఆరు నెలల క్రితం ఆమె తన సొంతూరుకు వెళ్లింది. ఆమె తన భర్తకు వద్దకు వచ్చిన తరువాత అతడు పదే పదే ఓ మహిళతో ఫోన్‌లో మాట్లాడడమే కాకుండా చాటింగ్ చేసేవాడు. పూజా వంటింట్లో పని చేస్తుండగా అతడు ఓ మహిళతో ఫోన్ల్‌లో గంట సేపటి నుంచి మాట్లాడుతూ కనిపించాడు. ఆమె అతడి ఫోన్ తీసుకొని చాటింగ్ చెక్ చేయగా మహిళతో మాట్లాడినట్టు గుర్తించింది. దీంతో దంపతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే ఆమె అతడి ఫోన్ తీసుకొని నేలకు కొట్టడంతో ముక్కలు ముక్కలైంది. ఇద్దరు గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె మరో రూమ్‌లోకి వెళ్లి లాక్ చేసింది. వెంటనే క్రిష్ణ రూమ్‌లోకి వెళ్లి లాక్ చేసుకొని ఉరేసుకున్నాడు. ఆమె గంట తరువాత వరండాలోకి వచ్చి చూడడంతో అతడు రూమ్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఓ మహిళతో అతడు ఫోన్ మాట్లాడుతున్నట్టు కాల్ రికార్డింగ్‌లో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News