Sunday, December 22, 2024

అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చేసిన అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే జిల్లాలోని గంభీర్ రావుపేట మండల పరిధిలోని గజసింగవరం గ్రామానికి చెందిన సుతారి ఆంజనేయులు  హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. 6 నెలల క్రితం బిడ్డ పెండ్లికి,ఇల్లు పున:నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక,ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని  ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News