Wednesday, January 22, 2025

చెరువులో మునిగి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చేగుంట: కుటుంబ పోషణ ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది వ్యక్తి చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఈప్తి ఎల్లయ్య (30) గత 10 సంవత్సరాల క్రితం ఈ ప్తి సునితతో వివాహం జరిగింది. 10 సంవత్సరాలుగా పిల్లలు పుట్టక పోవడం, కుటుంబ పోషన భారం కావడం ఆర్థికంగా లేక పోవడం వల్ల ఎప్పుడు బాధపడేవాడని గత రాత్రి ఇదే విషయంలో

భార్యతో గొడవ తీసి బైక్ తీసుకొని ఉదయం 8 గంటలకు బయటకు వెళ్ళి రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడంతో చుట్టు ప్రక్కల వెతకగా చేగుంట ఊర చెరువు వద్ద బైక్, మెట్ల వద్ద చెప్పులు ఉండడం చూసి కులస్తులతో వెతికించగా చెరువులో ఎల్లయ్య శవం లభ్యమైంది. ఈ విషయమై భార్య పిర్యాదుతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఎరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News