Thursday, January 23, 2025

పాకిస్థాన్‌లో మరో పరువు హత్య

- Advertisement -
- Advertisement -

లాహోర్ : పరువు పేరుతో పాకిస్థాన్‌లో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. ఏటా 1000 మంది మహిళలు ఈ విధంగా హత్యలకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పంజాబ్ ప్రావిన్స్ ముజఫర్‌నగర్ జిల్లా అలిపుర్ తహశీల్‌లో మంగళవారం మరో పరువు హత్య చోటు చేసుకుంది. ములాజిమ్ అనే వ్యక్తి తన సోదరి జైతూన్ బీబీ (20), అదే ప్రాంతం లోని ఫయ్యజ్ హుస్సేన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడు.

మంగళవారం ఫయ్యజ్‌ను కలుసుకోడానికి బయలుదేరిన సోదరి బీబీని అనుసరించి అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరినీ గొడ్డలితో అక్కడికక్కడే నరికి చంపాడని పోలీస్ ఆఫీసర్ హసీబ్ జావేద్ తెలియజేశారు. వారిని తానే చంపానని ఒప్పుకుని ములాజిమ్ పోలీస్‌ల ఎదుట లొంగిపోయాడు. తమ కుటుంబ గౌరవం మంట కలిపిందని వారిని చంపివేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీస్‌లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News