Monday, December 23, 2024

ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తిని మూడు ముక్కలు చేసి కాలువల్లో పారేసి..

- Advertisement -
- Advertisement -

ఘజియాబాద్ (యూపి): ఇంట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తిని హత్య చేయడమేకాక, శరీరాన్ని మూడు ముక్కలు చేసి కాలువల్లో పారేసిన ఘోర సంఘటనకు సంబంధించి నిందితుడు ఉమేష్ శర్మను ఎట్టకేలకు రెండు నెలల తరువాత పోలీసులు అరెస్టు చేయగలిగారు. ఈ హత్య ఘజియాబాద్ జిల్లాలో అక్టోబర్ 6న జరిగింది. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరకు బుధవారం పోలీసులు అరెస్టు చేయగలిగారు. మృతుడు అంకిత్ ఖోకర్ భాగ్‌పట్‌లో గల తన పూర్వీకుల భూమిని రూ. కోటి కి అమ్మాడు. నిందితుడు ఇంటి యజమాని ఉమేష్ శర్మకు ఆ డబ్బుపై కన్నుపడింది. కొన్నేళ్ల క్రితమే తన తల్లిదండ్రులు చనిపోవడంతో ఖోకర్ ఒంటరిగానే ఉంటున్నాడు. లక్నో యూనివర్శిటీలో పిహెచ్‌డి స్కాలర్‌గా నమోదు చేయించుకున్నాడు.

అయితే ఖోకర్ మిత్రులు గత కొన్నివారాలుగా ఫోన్ చేస్తున్నా సమాధానం లేకపోవడంతో ఖోకర్ కోసం వెతకడం ప్రారంభించారు. అతని నెంబర్ నుంచి మెసేజ్‌లు వస్తున్నా మాట్లాడినప్పుడు ఖోకర్ మాటలు కావని అనుమానించారు. ఫోన్ చేస్తుంటే సమాధానాలు రావడం లేదు. ఈ కేసులో అరెస్టయిన ఇంటి యజమాని ఉమేష్ శర్మకు గతంలో ఖోకర్ రూ. 40 లక్షలు అప్పుగా ఇచ్చాడు. చివరకు హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి ఉమేష్ గురించి పోలీసులు వాకబు చేయగా అతని భార్య తన భర్త ఎక్కడికి వెళ్లాడో తెలీదని చెప్పేది. చివరకు ఈ కేసులో ఖోకర్ గొంతునులిమి చంపినట్టు తేలింది. రంపంతో శరీరాన్ని మూడు భాగాలు చేసి అల్యూమినియం పాత్రలో ప్యాక్ చేసి ఒక భాగాన్ని ముజఫర్ నగర్ కాలువలో మరోభాగం మసోరి కాలువ లోను, మూడో భాగం ఎక్స్‌ప్రెస్‌వే పై పారేసినట్టు బయటపడింది. ఈ సంఘటనలో నిందితుని స్నేహితుడు పర్వేష్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శరీర భాగాలు ఇంకా దొరకవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News