Monday, December 23, 2024

కలహాలు…. బావమరుదులు, భార్యను కాల్చి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

Man kills wife in-laws in fit of rage

ఢిల్లీ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు బావమరుదులు గన్‌తో కాల్చి చంపిన సంఘటన వాయువ్య ఢిల్లీలోని షాకూర్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హితేంద్ర-సిమా అనే దంపతులు యాదవ్ మార్కెట్‌లో నివసిస్తున్నారు. హితేంద్ర కుటుంబంలో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి హితేంద్ర తన భార్య సిమా, బావమరుదులు సురేంద్ర(36), విజయ్(33)లతో గొడవకు దిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో హితేంద్ర ఇద్దరు బావమరుదులను గన్‌తో కాలిచి అనంతరం భార్యను కాల్చాడు. స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లేలోపు మార్గం మధ్యలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు డిసిపి ఉషా రంగ్నాని ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. గన్‌కు లైసెన్స్ ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News