Wednesday, January 22, 2025

భార్య, ముగ్గురు కుమార్తెలను చంపి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఖగారియా: భార్యను, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక వ్యక్తి. బీహార్‌లోని ఖగారియా జిల్లా ఎఖానియా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 1.30 ప్రాంతంలో ఈ దారుణం సంభవించింది. మృతులలో ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం మున్నా యాదవ్ మొదట తన భార్య పూజా దేవిని చంపాడు. ఆ తర్వాత ముగ్గురు కుమార్తెలు సుమన్(18), ఆంచల్(16), రోష్నీ కుమారి(15)ని పదునైన ఆయుధంతో చంపాడు. ఇద్దరు కుమారులను కూడా చంపడానికి ప్రయత్నించగా వారు తపిపంచుకు పారిపోయారు. అనంతరం తన ఇంటి బయట ఉన్న చెట్టుకు ఉరేసుకుని మున్నా యాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. యాదవ్ ఇద్దరు కుమారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌పి అమితేష్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News