హత్రాస్: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. కూతురిని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రిని ఏడుగురు దుండగులు కాల్చిచంపారు. వివరాల్లోకి వెళితే, 2018లో గౌరవ్ శర్మ అనే వ్యక్తి తన కుమారైను వేధిస్తున్నాడని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెల రోజులు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై బయటకు వచ్చిన గౌరవ్, అతనిపై పగ పెంచుకున్నాడు. సోమవారం గౌరవ్ శర్మ మరో ఆరుగురితో కలిసి యువతి తండ్రిని దారుణంగా హత్య చేశాడు.
హత్రాస్ పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ… మరణించిన వ్యక్తి గౌరవ్ శర్మపై వేధింపుల కేసులో 2018 జూలైలో కేసు పెట్టాడు. నిందితుడు జైలుకు వెళ్లి ఒక నెల తరువాత బెయిల్ వచ్చింది. అప్పటి నుండి, రెండు కుటుంబాలు ఒకదానికొకటి శత్రుత్వం పెరిగింది. మృతుడి ఇద్దరూ కుమార్తెలు, నిందితుడి భార్య, అత్త గ్రామంలోని దేవాలయానికి వెళ్లారు. అక్కడ మహిళలకు వాదన జరిగింది. అనంతరం నిందితుడు గౌరవ్ శర్మ, యువతి తండ్రి జోక్యం చేసుకోవడంతో పురుషుల మధ్య వాదన తీవ్రమైంది. దీని తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన గౌరవ్ తన కుటుంబానికి చెందిన కొంతమందిని సంఘటన స్థలానికి పిలిచి బాధితురాలి తండ్రిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతనిని సమీప ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడని వినీత్ జైస్వాల్ పేర్కొన్నారు.