Monday, November 18, 2024

మాంసం ఉద్దెరివ్వలేదనే కోపంతో.. ఓనర్ పై దాడి

- Advertisement -
- Advertisement -

man knife attack on chicken shop owner in Chevella

చేవెళ్ల: మాంసం ఉద్దెర ఇవ్వలేదనే కోపంతో దుకాణ యజమానిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం బస్తేపూర్ లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ దాడిలో దుకాణ యజమాని దస్తోజీకి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన అనిల్ పై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దస్తోజీ మహబూబ్ నగర్ నుంచి వచ్చి బస్తేపూర్ చికెన్ షాపు నడుపుతున్నాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.

man knife attack on chicken shop owner in Chevella

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News