- Advertisement -
పాపన్నపేట: ఇంటి స్థలం విషయంలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన పరవస్తు సంగమేశ్వర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పా పయ్య అనే వ్యక్తికి గత యేడాది క్రితం గ్రామంలో ఇంటి స్థలాన్ని విక్రయించాడు.ఈ స్థలం పాపయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో పాపయ్య తన స్నేహితుడు అయిన మక్సూద్‌తో కలిసి 4న లక్ష్మీనగర్ శివారులో సంగమేశ్వర్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో సంగమేశ్వర్ ఎడమ చేతికి గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పాపయ్య, మక్సూద్‌లను గురువారం రిమాండ్‌కి తరలించినట్లు ఎసఐ తెలిపారు.
- Advertisement -