- Advertisement -
వికారాబాద్: వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి బతికి బయటపడిన సంఘటన వికారాబాద్ జిల్లా బట్వారం మండలం నూరుల్లాపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సలబత్ పూర్ గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి నూరుల్లాపూర్ గ్రామ శివారులో వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై కొంచెం దూరంలో అతడిని రక్షించారు. సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -