Thursday, January 23, 2025

ఆన్‌లైన్‌లో ట్యాక్సీ బుక్ చేస్తే రూ. 2.23 లక్షలు మటాష్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: నాసిక్ వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో ట్యాక్సీ బుక్ చేసిన ముంబైకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంటర్‌నెట్ స్కామర్ల చేతిలో రూ. 2.23 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇటీవల ముంబైకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాసిక్ వెళ్లేందుకు ఒక ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించి వెబ్‌సైట్ ద్వారా ట్యాక్సీ బుక్ చేశాడు. కొద్ది నిమిషాలకే రజత్ అనే వ్యక్తి నుంచి ఆయనకు ఫోన్‌కాల్ వచ్చింది. ఆ ట్రావెల్ ఏజెన్సీ ఉద్యోగినని పరిచయం చేసుకున్న రజత్ ట్రావెల్ ఏజెన్సీ వెబ్‌సైట్‌కు రూ. 100 పంపాలని, దాన్ని ప్రయాణం తర్వాత వాపసు చేస్తామని తెలిపాడు.

బాధితుడు వెంటనే తన క్రెడిట్ కార్డు ద్వారా రూ. 100 పంపించాడు. కొద్ది సేపటి తర్వాత రజత్ మళ్లీ ఫోన్ చేసి వెబ్‌సైట్‌పై సాంకేతిక లోపం ఏర్పడిందని, మరోసారి రూ. 100 పంపించాలని బాధితుడిని కోరాడు. సరేనని బాధితుడు మరోసారి రూ. 100 పంపాడు. అయితే అది కూడా చేరకపోవడంతో ఆ విషయాన్ని బాధితుడు అక్కడితో వదిలేశాడు. అదే రోజు రాత్రి బాధితుడి మొబైల్‌కు రూ. 81,400, రూ.71,085, రూ.1.42 లక్షలు క్రెడిట్ కార్డు ఖాతాల అమౌంట్ డెబిట్ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి.

వెంటనే స్పందించిన బాధితుడు ఇందులో ఏదో మోసం ఉందని గ్రహించి బ్యాంకుల కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి తన క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయాలని కోరాడు. ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే బాధితుడు సకాలంలో స్పందించడంతో అదృష్టవశాత్తు అతని ఖాతాకు రూ. 71,085 తిరిగి క్రెడిట్ అయ్యాయి. అయితే రెండు ఖాతాల నుంచి డెబిట్ అయిన సొమ్ము మాత్రం తిరిగి రాలేదు. దీంతో అతను దాదాపు రూ.2.2 లక్షలు కోల్పయాడు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News