Sunday, December 22, 2024

వయనాడ్ మిగిల్చిన విషాదం: 11 మంది ఆప్తులను కోల్పోయి.. ఏకాకిగా మిగిలాడు

- Advertisement -
- Advertisement -

వయనాడ్(కేరళ): తన కుటుంబానికి మెరుగైన జీవితాన్ని కల్పించాలన్న ఆశతో మూడు నెలల క్రితం ఓమన్ దుదేశానికి వెళ్లిన కేరళలోని ఒక వ్యక్తికి తేన స్వగ్రామ వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన గుర్ఘటన కోలుకోలేని విషాదాన్ని నింపింది. మూడు నెలల క్రితం విదేశాలకు వెళుతూ తన ఆప్తులకు చెప్పిన వీడ్కోలు అదే చివరి చూపు అవతుందని ఆనాడు అతను ఊహించలేదు. ఆ విషాద ఘటనలో కుటుంబానికి చెందిన 11 మందిని కోల్పోయిన ఆ వ్యక్తి చివరకు ఏకాకిగా మిగిలాడు. వయనాడ్‌పై విరుచుకుపడిన కొండచరియలు మృత్యు ఘోషను వినిపించాయి. ఈ ప్రకృతి బీభత్సానికి వందలాది మంది మరణించగా అనేక వందల మంది జాద ఇప్పటికీ తెలియరాలేదు.

ఈ ఘోరం గురించి తెలియగానే ముండక్కైకు చెందిన నౌఫల్ ఓమన్ నుంచి బయల్దేరి వచ్చేశాడు. తన గ్రామానికి సోమవారం ఉదయం చేరుకున్న అతనికి అక్కడ మట్టి దిబ్బలు తప్ప ఇళ్లు ఏవీ కానరాలేదు. తన ఇల్లు ఉన్న ప్రదేశానికి వెళ్లిన అతనికి మట్టి దిబ్బ కనిపించడంతో వెక్కి వెక్కి ఏడుస్తూ తన కుటుంబ సభ్యుల కోసం వెదుకులాడడం అక్కడ గ్రామస్తులందరి చేత కంటనీరు పెట్టించింది.

తన తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, సోదరుడు, వదిన, వారి పిల్లలు మొత్తం 11 మందిని నౌఫల్ కోల్పోయాడు. మట్టి దిబ్బల కింద చిక్కుకున్న తన కుటుంబ సభ్యులు తిరిగి వస్తారేమోనన్న ఆశతో అతను ఆ ప్రదేశాన్ని కలియతిరగడం చూసిన వారి గుండె బరువెక్కింది. అతడిని ఓదార్చడం గ్రామస్తులకు సాధ్యం కావడం లేదు. ఈ విషాదం నుంచి నౌఫల్ ఎలా తేరుకుంటాడోనని గ్రామస్తులు సైతం ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News