Sunday, December 22, 2024

ఇద్దరు భార్యలకు చెరో 3 రోజులు: ఫ్యామిలీ కోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఆయనకు ఇద్దరు భార్యలు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి విషయం తెలిసి మొదటి భార్య విడాకుల కోసం కోర్టుకెక్కింది. అయితే విడాకులు తీసుకోవడం కన్నా మరో సరిష్కరార్గాన్ని సూచించింది ఫ్యామిలీ కోర్టు. ఇద్దరు భార్యల దగ్గర చెరో మూడు రోజులు గడపాలని, వారంలో మిగిలిన ఒక్కరోజును తన ఇష్టం వచ్చిన రీతిలో గడపుకోమని ఆ భర్తకు తన ఇద్దరు భార్యలతో సంధి కుదిర్చింది ఫ్యామిలీ కోర్టు. ఈ సంఘటన ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో చోటుచేసుకుంది.

మీడియా కథనాల ప్రకారం..గ్వాలియర్‌లో మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తికి 2018లో వివాహమైంది. 2020లో కొవిడ్ కాలంలో అతడు తన భార్యను ఆమె తల్లి గారింట వదిలిపెట్టి గురుగ్రామ్‌కు బదిలీపై వెళ్లాడు. అక్కడ తన కంపెనీలోనే పనిచేసే ఒక మహిళా ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమబంధంగా మారింది. తనకు ఇదివరకే పెళ్లయినప్పటికీ ఆ విషయాన్ని మరచి సహోద్యోగిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే గ్వాలియర్‌లో తన తల్లి వద్ద గడుపుతున్న మొదటి భార్యకు భర్తపై అనుమానం ఏర్పడింది.

ఆరా తీస్తే అతడు గురుగ్రామ్‌లో రెండో పెళ్లి చేసుకున్నట్లు బయటపడింది. దీంతో ఆమె విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును సంప్రదించారు. అయితే..కోర్టు మాత్రం ఇది పరిష్కారం కాదని ఆమెకు నచ్చచెప్పారు. ఆమె భర్తను రప్పించి చెరో భార్యకు ఒక్కో ఇల్లును గురుగ్రామ్‌లోనే కొనుగోలు చేయాలని, వారిద్దరినీ వారి వారి ఇళ్లలో ఉంచి చెరో మూడు రోజులు ఒక్కో ఇంట్లో గడపాలని సూచించింది. ఆదివారాలు మాత్రం నీ ఇష్టం వచ్చిన చోట గడపమని కోర్టు సూచించడంతో ముగ్గురికీ ఈ ఒప్పందం నచ్చింది. ఇప్పుడా భర్త గురుగ్రామ్‌లో రెండు ఇళ్లు కొని ఇద్దరు భార్యలకు ఆ ఇళ్లు రాసిచ్చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News