హైదరాబాద్: నగరంలోని శనివారం రాత్రం కురిసిన భారీ వర్షానికి మణికొండలో గోల్డెన్ టెంపుల్ దగ్గర రోడ్డుపై పారుతున్న వరదతో సరిగా కనిపించక ఓ వ్యక్తి మ్యాన్ హోల్ లో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి కోసం డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బంది 10 గంటలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు గల్లంతైన వ్యక్తి ఆచూకి లభించకపోవడంతో సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. ఇప్పటివరకు చుట్టుపక్కల ఎక్కడా కూడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. ఈ ఘటనకు కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నగరంలో శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో పలు రహదారులు చిన్నపాటి చెరువులను తలపించాయి.
Man missing as fell into Manhole at Manikonda