Thursday, January 23, 2025

చాదర్‌ఘాట్ పిఎస్ పరిధిలో వ్యక్తి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉస్మాన్‌పురకు చెందిన నీరుటి వినోద్(26) గత నెల 24వ తేదీ నుంచి కన్పించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆచూకీ కోసం వెతికినా కూడా ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో వినోద్ తల్లి యాదమ్మ చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి గురించి తెలిసిన వారు చాదర్‌ఘాట్ పోలీసులు మొబైల్ నంబర్ 8712661266లో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News