- Advertisement -
రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శంషాబాద్ మండలంలోని తొండుపల్లిలో ఈ ఘటన జరిగింది. డబ్బుల విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో తమ్ముడు యాదగిరిపై అన్న శ్రీనివాసులు కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యాదగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Man murder by his brother in Shamshabad
- Advertisement -