Sunday, December 22, 2024

దొంగతనానికి వచ్చి… స్థానికుల చేతిలో ప్రాణాలు విడిచి

- Advertisement -
- Advertisement -

మొబైల్ చోరీకి వచ్చిన ఓ దొంగ స్థానికులు దాడి చేయడంతో ప్రాణాలు విడిచిన సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మెహిదిపట్నం, సంతోష్ నగర్ లోని షాదత్ బిల్డర్ ఐదు అంతస్థుల భవనం నిర్మిస్తున్నాడు. ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన షేక్ సనవర్ (30), షేక్ సలీం (35) ఇద్దరు పనిచేస్తున్నారు. నిర్మాణం జరుగుతున్న భవనంలో 6 నెలలుగా అందులో ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. కాగా శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ గుర్తు వ్యక్తి దొంగ మొబైల్ ఫోన్ దొంగిలించెందుకు

నిర్మాణంలో ఉన్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లోకి దూకాడు. ఇది గమనించిన కూలీలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దొంగ తన వెంట తెచ్చుకున్న కత్తితో షేక్ సనావర్, షేక్ సలీంపై దాడి చేయడంతో సనావర్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం చెందిన సనవర్, షేక్‌సలీం దొంగను కట్టెలతో కోట్టారు, తర్వాత డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొందను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కమిషనర్ వచ్చి వెళ్లిన కొద్ది గంటల్లోనే…
ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా హత్యలు జరుగుతుండడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం రాత్రి సౌత్ వెస్ట్ జోన్‌లోని ఆసిఫ్ నగర్, గుడి మల్కా పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అయితే పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి వచ్చి వెళ్లిన కొద్ది గంటలకే ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల నిర్లక్షం వల్లే ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసు అధికారులు బస్తీలు, కాలనీల్లో పెట్రోలింగ్‌ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News