Sunday, December 22, 2024

మంచిరేవులలో దారుణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సిటీ బ్యూరో: నార్సింగీలోని మంచిరేవులలో దారుణం చోటు చేసుకుంది. ఒకే చోట పని చేస్తున్న తాపీ మేస్త్రీ, వాచ్‌మెన్‌ల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి హత్యకు గురైయ్యారు. సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న విచారణ చేపట్టారు. అయితే హంతకుడు పరారీలో ఉండగా, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం మంచిరేవులోని ఓ భవన నిర్మాణంలో భాగంగా అక్కడ జంగయ్య అనే వాచ్ మన్‌నుగా పని చేస్తుండగా అర్జున్ అనే వ్యక్తి తాఫీ మేస్త్రీగా పని చేస్తున్నారు. అయితే వాచ్‌మెన్ జంగయ్యగత కొన్ని రోజులుగా యజమానికి తెలియకుండా స్క్రాప్ అమ్ముకుంటున్నారు. ఇదేక్రమంలో మేస్త్రీ అర్జున్ కంటపడడంతో వాచ్‌మెన్ జంగయ్యను పలుమారు హెచ్చరించినప్పటీకి పట్టించుకోకుండా అదే విధంగా స్క్రాప్‌ను అమ్ముకుకోవడంతో ఈ సమాచారాన్ని భవన నిర్మాణ యాజమని సమాచారం ఇచ్చారు.

దీంతో జంగయ్యను భవన నిర్మాణ యాజమాని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇదేక్రమంలో సంక్రాంతి పండుగ కావడంతో తప్పతాగిన వాచ్‌మెన్ జంగయ్య నాపైనే యాజమానికి ఫిర్యాదు చేస్తావంటూ మేస్త్రీ అర్జున్‌తో ఘర్షణకు దిగారు. దీంతో ఇద్దరు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకోవడంతో మద్యం మత్తులో ఉన్న అర్జున్ సైతం పదునైన ఆయుధంతో వాచ్‌మెన్ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. దీంతో మేస్త్రీ అర్జున్ అక్కడి నుంచి పరార్ కాగా, డయల్ 100కు స్థానికులు సమాచారం అందించారు .దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్గం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అదేవిధంగా నిందతుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News