Wednesday, January 22, 2025

మ్యాన్ ఆఫ్ ది సిరీస్… శ్రేయస్ కాకుండా పూజారాకు ఎలా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగ్లాదేశ్-భారత్ మధ్య జరిగిన టెస్టులో సిరీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల్లో అత్యధిక పరుగులు 222 చేసిన పూజారాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. రెండు మ్యాచ్‌ల్లో పూజారా సగటు 74గా ఉంది. పూజారా తొలి టెస్టులో 90, 102గా ఉండగా రెండో టెస్టు 24, 06 పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యాడు. రెండు టెస్టులో జట్టుపై భారంగా మారడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండు టెస్టులో పరుగులు చేయని పూజారాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎలా ఇస్తారనేది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఈ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో శ్రేయస్ అయ్యర్ (202) రెండో స్థానంలో ఉన్నాడు. శ్రేయస్ సగటు 101గా ఉంది. తొలి టెస్టులో 86 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. రెండు టెస్టులో తొలి ఇన్నింగ్స్ 87, రెండో ఇన్నింగ్స్ 29 పరుగులు చేసి ఓటమి నుంచి తప్పించాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 94 పరుగులకే రాహుల్, శుభమన్ గిల్, పూజారా, కోహ్లీ ఔట్ కావడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాలో పడింది. ఈ సమయంలో పంత్‌తో కలిసి శ్రేయస్ 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రెండో టెస్టులో ఓటమి నుంచి తప్పించడానికి తొలి బ్యాట్స్‌మెన్లు శ్రేయస్ కావడం గమనార్హం. కానీ శ్రేయస్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వకుండా పూజారాకు ఎలా ఇచ్చారనేది? ప్రశ్నగా మారింది. శ్రేయస్ త్వరగా ఔటైతే ఈ సిరీస్ డ్రాగా మారేది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News