Monday, January 20, 2025

ప్రేమపెళ్లి…. భార్య రావడంలేదని కుటుంబ సభ్యులపై భర్త కాల్పులు… ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు… భర్త దగ్గరకు భార్య రాకపోవడంతో పాటు ఆమెకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమె కుటుంబం సభ్యులను తుపాకీతో కాల్చడంతో ఆమె సోదరులు మృతి చెందిన సంఘటన బిహార్‌లోని లఖిసరాయి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దుర్గా ఝా, ఆశిష్ చౌదరీ ప్రేమించుకున్నారు. ఇద్దరు కులాలు వేరుకావడంతో ఇంట్లో వాళ్లు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఐదు సంవత్సరాల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఒక సంవత్సరం క్రితం ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అప్పటి నుంచి ఆశిష్ వద్దకు రాను అని ఖరాఖండిగా చెప్పింది. తన కుటుంబ సభ్యులు పంపించడానికి రెడీగా లేరని తేల్చి చెప్పింది.

పది రోజుల క్రితం తన భార్యను పంపించాలని ఆశిష్ దుర్గా సోదరులతో గొడవకు దిగాడు. సోమవారం సాయంత్రం ఆ ఇంటికి వచ్చి దుర్గా కుటుంబ సభ్యులను గన్‌తో కాల్చాడు. ఈ కాల్పుల్లో దుర్గా సోదరులు చందన్ ఝా(31), రాజ్‌నందన్ ఝా(40) ఇద్దరు మృతి చెందగా దుర్గా సోదరిమణులు దేవి(38), ప్రితీ దేవి, దుర్గా తండ్రి శశి భూషన్ ఝా(60), దుర్గా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పది పేజీలు గల లేఖను వదిలివెళ్లిపోయాడు. దుర్గా మరోక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తన దగ్గర రావడంలేదని కోపంతో ఆమె కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపానని, ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నానని లేఖలో ఆశిష్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News