Wednesday, January 1, 2025

వామ్మో మొసలితో ఆటలు… మాంసం తినిపిస్తూ…

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: నీళ్లలోకి దిగి మొసలికి ఆహార పదార్థాలు తినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తన ప్రియురాలుతో కలిసి చిన్న గుంటలోకి దిగాడు. ఆ గుంటలో అప్పటికే మొసలి ఉంది. మొసలిని సైగలు చేస్తూ పిలిచి దానికి ఆహారం అందించగానే వెళ్లిపోయింది. మొసలి వాళ్ల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ల పని అయిపోయిందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. మొసలి ఆహారం తీసుకున్న తరువాత కొద్ది దూరం వెళ్లిన తరువాత తన చేతిలో ఉన్న ఆహార పదార్థాలను దానిపైకి విసిరాడు. నీటిలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. నీటిలో ఉన్నప్పుడు మొసలితో పోరాటం చేయడం కష్ట సాధ్యం. వాళ్ల ధైర్యానికి హ్యాట్సాఫ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఐదు రోజుల వ్యవధిలో ఈ వీడియోను 28 వేల మంది లైక్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News