Monday, November 18, 2024

ట్యాంక్ విధ్వంసక క్షిపణి పరీక్ష సక్సెస్

- Advertisement -
- Advertisement -

Man Portable Anti-Tank Guided Missile successfully launched

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మిస్సైల్

న్యూఢిల్లీ: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఒ) శత్రు దేశాల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్(ఎంపిఎటిజిఎమ్)ను బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఈ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్‌డిఒ రూపొందించింది. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించిందని డిఆర్‌డిఒ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్షిపణిలో అత్యాధునిక ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలున్నాయని డిఆర్‌డిఒ తెలిపింది. సమీపంలోని టార్గెట్లను కచ్చితంగా ధ్వంసం చేయడం కోసం ఈ క్షిపణిని తయారు చేసినట్టు డిఆర్‌డిఒ తెలిపింది. పరీక్షలో భాగంగా టార్గెట్‌గా పెట్టిన డమ్మీ ట్యాంక్‌ను ఈ క్షిపణి ధ్వంసం చేసిందని డిఆర్‌డిఒ తెలిపింది. సుదూర లక్షాలను ఛేదించే పరీక్షల్లో ఇప్పటికే ఈ క్షిపణి విజయవంతమైందని డిఆర్‌డిఒ పేర్కొన్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News