Friday, April 4, 2025

భూకంప శిథిలాల నుంచి ఐదు రోజుల తర్వాత సజీవంగా

- Advertisement -
- Advertisement -

మయన్మార్, టర్కిష్‌కు చెందిన సహాయ సిబ్బంది రెస్కూ ఆపరేషన్ కొనసాగిస్తుండగా, నేపిడా లోని ఓ భవనం శిథిలాల కింద 26 ఏళ్ల వ్యక్తిని గుర్తించారు. వెంటనే అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. రెస్కూ సిబ్బంది ఇటీవల మాండలే లోని గ్రేట్‌వాల్ హోటల్ శిథిలాల నుంచి ఒక గర్భిణీని సజీవంగా బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఇక ఈ భూకంపం కారణంగా మధ్య , వాయువ్య మయన్మార్‌లో మొత్తం 10 వేల భవనాలు కూలిపోవడం లేదా పనూర్తిగా దెబ్బతిన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. మయన్మార్‌లో ఇప్పటివరకు 2719 మంది మృతి చెందగా, 4521 మంది గాయపడ్డారు. ఇంకా 441 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూకంపం కారణంగా నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కూలిపోగా, ఇప్పటివరకు13 మృతదేహాలు బయటపడ్డాయి. ఈ శిథిలాల కింద 300 మంది కార్మికులు చిక్కుకుని ఉంటారని , వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చిన వారేనని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News