Sunday, January 19, 2025

పిల్లలను గోదావరిలోకి నెట్టినా పెంపుడు తండ్రి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… గుంటూరు జిల్లాకి చెందిన ఉలవ సురేష్ కూడా తాడేపల్లిలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. సురేష్‌కి అప్పటికే పెళ్లయింది. అయితే సుహాసినిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఎన్టీఆర్ కరకట్టపై ఓ ఇంట్లో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. జెర్సీ (ఒక ఏడాది పాప) పుట్టిన తర్వాత గొడవలు మొదలై ఇద్దరూ విడిపోయారు. సుహాసిని తన ఇద్దరు పిల్లలతో క్రిస్టియన్‌పేటలో ఉంటోంది. సురేష్ తరచూ వచ్చి సుహాసినితో గొడవ పడేవాడు. సురేష్ తాను సహజీవనం చేస్తున్న పుప్పాల సుహాసిని (36)ని ఆమె కుమార్తెలు కీర్తన (13), జెర్సీ (1) లను వదిలించుకోవాలని ఆదివారం ఉదయం నాలుగు గంటలకు గోదావరిలోకి నెట్టి వేశాడు. ఈ దుర్ఘటనలో సుహాసిని, జెర్సీ గల్లంతయ్యారు.

13 ఏళ్ల కీర్తన మాత్రం బ్రిడ్జి పక్కన వేసిన కేబుల్ పైప్ ఒక చేత్తో పట్టుకుని వేలాడి ప్రాణాలు కాపాడుకుంది. అదే సమయంలో తన జేబులో ఫోన్ ఉన్న విషయం గుర్తొచ్చి 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చి కీర్తన ప్రాణాలు కాపాడారు. అర గంట పాటు పైపుకి వేలాడి ప్రాణాలు కాపాడుకొని.. తమకు ఫోన్ చేసిన కీర్తన సమయస్పూర్తికి, ధైర్యాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు.

పోలీసులు సకాలంలో స్పందించారు
బ్రిడ్జి పై నుంచి కింద పడుతున్న సమయంలో కీర్తన బ్రిడ్జి కేబుల్ పైపును పట్టుకుంది. ఆమె తన ఫోన్‌తో తెల్లవారుజామున 3.50 గంటలకు 100 నంబర్‌కు డయల్ చేసింది. ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. ప్రాథమిక చికిత్స చేసి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. సుహాసిని, కీర్తనల ఆచూకీ కోసం పోలీసులు పడవలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కోసం మరో బృందం విస్తృతంగా గాలిస్తోంది. కీర్తన ప్రాణాలను కాపాడిన పోలీసులను ఎస్పీ శ్రీధర్ అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News