- Advertisement -
అర్జెంటీనా: ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న రైలు ముందు పట్టాలపై పడి అదృష్టవశాత్తూ మృత్యువు నుంచి బయటపడ్డాడు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వీక్షకులను భయాందోళనకు గురి చేసోంది. ఓ వ్యక్తి బ్యాలెన్స్ తప్పి ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న రైలు ముందు రైలు పట్టాలపై పడిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. రైలు అతనిపై నుండి వెళ్ళింది. అయితే అదృష్టవశాత్తూ అగ్నిమాపక సిబ్బంది అతన్ని రక్షించారు. అతనికి స్వల్పగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
video courtesy by Inside Edition
- Advertisement -