- Advertisement -
ముంబయి: పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని కత్తితో పొడవడంతో కడుపులో కత్తి దిగిన పోలీస్ స్టేషన్కు పరుగుపెట్టిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బహిరంగ మైదానంలో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కత్తితో పొడిచారు. కడుపులో రక్తం కారుతున్న వారి నుంచి తప్పించుకొని ఆర కిలో మీటర్ పరుగు తీశాడు. కొంత దూరం వెళ్లిన తరువాత స్నేహితుడు లిఫ్ట్ ఇవ్వడంతో కడుపులో కత్తితో పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. పోలీసులు వెంటనే బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -