Monday, December 23, 2024

శ్వాసనాళంలో భారీ కణితి.. కాపాడిన వైద్యులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గతంలో ఎలాంటి ఆనారోగ్యాలు లేని నిజామాబాద్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఎప్పుడు ధూమపానం కూడా చేసిన చరిత్ర లేకపోయినా శ్వాసనాళంలో భారీ కణితి రావడంతో తీవ్రమైన దగ్గు, ఆయాసం, జ్వరంతో బాధపడుతూ వెంటిలేటర్‌పై కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి పల్మనాలజిస్టు డా. శ్రీకాంత్ కిషన్ వివరిస్తూ రోగికి తీవ్రంగా ఆయాసం వస్తూ,

ఊపిరి అందని పరిస్థితి ఏర్పడంతో నిజామాబాద్‌లోని ఒక ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం కోసం తమ ఆసుపత్రికి రిఫర్ చేశారని చెప్పారు.ఆసుపత్రికి రాగానే బ్రాంకోస్కోప్ చేసి చూస్తే శ్వాసనాళంలో పెద్ద కణితి ఉంది అది 1.8 సెంటిమీటర్ల వెడల్పు, 2.5 సెంటిమీటర్ల పొడువుతో శ్వాసనాళంలో 90శాతం అక్రమిస్తోందన్నారు.

సాధారణంగా ఇంత పెద్ద కణితులను ఆపరేషన్ చేసి తీస్తారు. కానీ ఇక్కడ మాత్రం రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపిక్ పద్దతితో కణితిని తొలగించి వ్యక్తి ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News