Thursday, January 23, 2025

తమిళనాడులో హిందీ రుద్దడానికి వ్యతిరేకంగా వృద్ధుడి ఆత్మాహుతి

- Advertisement -
- Advertisement -

సేలం: తమిళనాడులో హిందీ రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ సేలం జిల్లాలో ఓ 85 ఏళ్ల వృద్ధుడు ఆత్మాహుతి చేసుకున్నాడు. మెట్టూరుకు సమీపంలోని తలైయూర్‌కు చెందిన తంగవేల్‌గా అతడిని గుర్తించారు. ఆయన డిఎంకె వ్యవసాయ విభాగంలో యూనియన్ ఆర్గనైజర్‌గా పనిచేశారు. కొన్నేళ్ల క్రితం క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించారు. కాగా తలైయూర్ పార్టీ కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు వచ్చినా ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

“ఆయన పార్టీ కార్యాలయం ముందు ఓ లేఖను ఉంచారు. తమిళం మాట్లాడే రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం హిందీని రుద్దొదు అని అందులో అతడు పేర్కొన్నాడు. ఒకవేళ విద్యార్థులు హిందీ నేర్చుకుంటే వారు ప్రభావితులవుతారు అని కూడా పేర్కొన్నాడు” అని మెట్టూరు పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. “ఆయన తనకు తానుగా కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు” అని కూడా ఆ పోలీస్ అధికారి తెలిపారు. తమిళనాడు కార్మిక సంక్షేమ మంత్రి సివి. గణేశన్, తదితర పార్టీ కార్యకర్తలు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News