Wednesday, January 22, 2025

చైనీస్ మాంజా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ హైదరాబాద్ : నిషేధిత చైనీస్ మాంజాను విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.12లక్షల విలువైన 48బాక్స్‌ల మాంజాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మలక్‌పేటకు చెందిన భగవాన్ దాస్ బజాజ్ పతంగుల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతి ఏడాది సంక్రాంతికి పతంగుల వ్యాపారం జోరుగా సాగుతుండడంతో నిందితుడు భారీ ఎత్తున పతంగులు, చైనీస్ మాంజాను విక్రయించాలని ప్లాన్ వేశాడు. కైట్లు, చక్రాలు, దారంను విక్రయిస్తున్నాడు.

ఈ క్రమంలోనే నిందితుడు వివిధ బ్రాండ్ల పేరుతో కైట్లను, మాంజాను తయారు చేస్తున్నాడు. మార్కెట్‌లో చైనీస్‌మాంజాకు భారీగా డిమాండ్ ఉండడంతో దానిని విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. దీనికి అనుగుణంగా చైనీస్ మాంజాను ఢిల్లీలోని మాలి రామ్ వద్ద కొనుగోలు చేసి విక్రయించేందుకు నగరానికి తీసుకుని వచ్చాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు నర్సింహులు, శ్రీశైలం, నరేందర్, షేక్‌బురాన్ తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News