Wednesday, January 22, 2025

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

పరారీలో ఇద్దరు నిందితులు

హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న కారు డ్రైవర్‌ను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మీర్‌చౌక్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులను పరారీలో ఉన్నారు. నిందితుడి వద్ద నుంచి 24కిలోల గంజాయి, మొబైల్ ఫోన్, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నల్గొండ జిల్లా, దామెచర్ల మండలం, కొండ్రపాలే గ్రామం, చెల్ల తండాకు చెందిన లావూరి నాగరాజు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చేస్తున్న పనిలో వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోవడంలేదు.

ఈ క్రమంలోనే గంజాయి విక్రయించాలని ప్లాన్ వేశాడు. దీనికి తన స్నేహితులు సూర్యపేటకు చెందిన సంతోష్, ఎ. నాగరాజు సాయం కోరాడు. వారు కూడా అంగీకరించడంతో ముగ్గురు కలిసి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. సంతోష్, ఎ.నాగరాజు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం మీర్‌చౌక్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News