Friday, September 20, 2024

బావమరిదికి భార్య అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపించి…

- Advertisement -
- Advertisement -

Man sends wife's obscene photos videos sends her brother

భోపాల్: అదనపు కట్నం కావాలని భర్త వేధించడంతో భార్య అతడిపై కేసు పెట్టడంతో ఆమెతో అసభ్యకరంగా ఉన్న  అశ్లీల ఫోటోలు, వీడియోలను ఆమె సోదరుడికి పోన్‌లోకి పంపించిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో జరిగింది. దీంతో అతడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గ్వాలియర్ ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తితో సదరు యువతికి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. గత రెండు సంవత్సరాల నుంచి అదనపు కట్నం తీసుకరావాలని ఆమెను భర్త వేధిస్తున్నాడు. అతడి వేధింపుల తట్టుకోలేక స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై వర్నకట్నపు కేసు నమోదు చేసింది. గతంలో ఆమెతో చనువుగా ఉన్నప్పుడు అశ్లీల ఫోటోలు, వీడియోలు ఆమె తెలియకుండ తీసుకున్నాడు. ఆ ఫోటోలను, వీడియోలను ఆమె సోదరుడు ఫోన్‌కు పంపించాడు. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. వరకట్నపు కేసు తొలిగించుకోవడానికే పోటోలను పంపించానని నిజాలు ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News