- Advertisement -
బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి 25ఏళ్ల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ నాంపల్లిలోని పోక్సో కోర్టు న్యాయమూర్తి అనిత తీర్పు చెప్పారు. హైదరాబాద్, రాజ్‌భవన్ , ఎంఎస్ మక్తాకు చెందిన గుట్ల శ్రీనివాస్ హౌస్ కీపింగ్ పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 28,2023న బాలిక సేహితులతో కలిసి ఆడుకుంటుండగా నిందితుడు మొబైల్ ఫోన్ ఇస్తానని చెప్పి తనతో తీసుకుని వెళ్లాడు. బాలిక బుగ్గలపై ముద్దపెట్టి, లోదుస్తులు తీసివేశాడు. అక్కడి నుంచి బయటికి వచ్చిన బాలిక విషయం తల్లికి చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సాక్షాలు సేకరించిన పోలీసులు వాటిని కోర్టులో ప్రవేశపెట్టడంతో వాటిని పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
- Advertisement -