Wednesday, January 22, 2025

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు శిక్ష

- Advertisement -
- Advertisement -

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం… మహబూబ్‌నగర్ జిల్లా, ఉంగూరు, కొండారెడ్డిగూడెంకు చెందిన ఉప్పునూతల హరీష్ కర్మాన్‌ఘాట్‌లలో ఉంటున్నాడు. బాలికపై 2016లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆధారాలను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, జరిమామా విధిస్తూ తీర్పు చెప్పింది. బాధితురాలికి రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News