Thursday, January 9, 2025

భార్యపై దాడి చేసిన భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః భార్యపై దాడి చేసి గాయపర్చిన భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని జిఎం చౌనీకి చెందిన షబానా బేగంకు ఎండి ఫీరోజ్‌తో వివాహమైంది. ఫిరోజ్‌కు వివాహేతర సంబంధాలు ఉండడమే కాకుండా వేరే మహిళలను వివాహం చేసుకున్నాడు. దీనిపై షబానాకు ఫిరోజ్‌కు తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలోనే జూన్ 16,2018న షబానాపై ఫిరోజ్ కత్తితో దాడి చేసి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన షబానాను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు దర్యాపు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సాక్షాలను పోలీసులు కోర్టుకు సమర్పించడంతో జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News