Thursday, January 23, 2025

కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

టేకుమట్లః కోతుల దాడిలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పోందిన ఘటన మండలంలోని రామకిష్టాపూర్ (టి) గ్రామంలో చోటుచేసుకుంది. భాదితుడు తెలిపిన వివరాల ప్రకారం పెసరు మళ్ళికార్జున్(38) అనే వ్యక్తి తన ఇంటి ముందు కూర్చున సమయంలో తన ఇంటి వైపు వస్తున్న కోతుల గుంపును వెళ్ళగోట్టె ప్రయత్నం చేయగా, అవి ఒక్కసారిగా దాదాపు 30 కోతుల వరకు ముకుమ్మడిగా దాడి చేసి విచక్షన రహితంగా కోరికి తీవ్ర రక్తస్రావం అయ్యేలాగా దాడి చేసాయని, చుట్టు ప్రక్కల వారు వచ్చి వాటిని దూరంగా తరమగా అవి వెళ్ళిపోయానని భాదితుడు తెలిపాడు. చికిత్స నిమిత్తం భాదితున్ని చిట్యాల ఆసుపత్రికి తరలించి వైద్యం ఆందిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి కోతుల దాడి నుండి ప్రజల్ని రక్షించాలని, వాటిని అడవులకు పంపించే ప్రయత్నం చేయాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News