Monday, December 23, 2024

నల్లమల అడవిలో ప్రియురాలిని హత్య చేసి..

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు: జిల్లాలోని నల్లమల అడవిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నల్లమల అడవిలో తిమ్మాజిపేట మండలం గోరటి గ్రామానికి చెందిన లక్ష్మీని ఆమె ప్రియుడు చెన్నయ్య హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ హత్యపై జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

దీంతో విచారణ చేపట్టిన పోలీసులు, సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. శవానికి పంచనామా నిర్వహించి పూడ్చి వేశారు. అనంతరం ఈ దారుణ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News