Friday, December 20, 2024

అన్నం వండిపెట్టలేదని తల్లిని తగలబెట్టిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

ముంబయి: అన్నం వండిపెట్టలేదని కన్న తల్లిని కుమారుడు సజీవదహనం చేసిన సంఘటన మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రెవ్‌దందాలోని నవ్‌ఖర్ గ్రామంలో జయేష్ అనే కుమారుడు తన తల్లితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అన్నండ వండిపెట్టలేదని తల్లితో జమేష్ గొడవకు దిగాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో తల్లి బయటకు లాకొచ్చి ఆమెపై కట్టేలు వేసి తగలబెట్టాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పారిపోయిన జయేష్‌ను దగ్గరలో ఉన్న అడవిలో పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News