- Advertisement -
అమృత్ సర్: బాబా బకాల ప్రాంతంలోని బుల్లీ నంగల్ గ్రామంలో ఓ వ్యక్తి తన 23 ఏళ్ల గర్భవతి భార్యను ఆదివారం సజీవంగా తగులబెట్టాడని పోలీసులు తెలిపారు. భార్యతో పోట్లాడాక సుఖ్ దేవ్ సింగ్ తన భార్యను తగుల బెట్టాడు. ఇద్దరు కవలలకు జన్మనివ్వాల్సిన ఆరు నెలల గర్భవతి పింకీని అతడు మంచానికి కట్టేసి మరీ తగులబెట్టాడు.
ఊరి సర్పంచ్ రిపోర్టు ఇచ్చాక పోలీసులు వచ్చేసరికి ఆమె కాలిన గాయాలతో చనిపోయింది. సుఖ్ దేవ్ పారిపోయినప్పటికీ అతడిపై హత్యా నేరం బుక్ చేసి పట్టుకున్నారు పోలీసులు. సుఖ్ దేవ్, పింకీ రెండున్నర ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.
- Advertisement -