Sunday, January 19, 2025

ప్రియుడితో కలిసి వచ్చిన భార్య… కాల్పులు జరిపిన భర్త

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: భార్య ప్రియుడితో కలిసి రావడంతో అతడిపై భర్త తుపాకీతో కాల్చిన సంఘటన ఒడిశా రాష్ట్ర శంబల్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఝంకర్‌పదా గ్రామానికి చెందిన స్వాధిన్ ప్రధాన్ అనే వ్యక్తి మిరా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని నెలలకే భార్య తన ప్రియుడు పంకజ్ డెహురీతో కలిసి పారిపోయింది. తన ప్రియుడితో కలిసి జీవనం సాగిస్తోంది. కొన్ని సంవత్సరాల తరువాత మిరా తన ప్రియుడితో కలిసి పని ఉండడంతో ఝంకర్‌పదా గ్రామానికి వచ్చారు. భర్తకు ఎదురుగా రావడంతో ప్రియుడిపై అతడు కాల్పులు జరిపాడు. చేతులు, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా హెడ్ మాస్టర్ మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News