ముంబయి: ప్రియుడు తన ప్రియురాలిని గన్‌తో కాల్చి పారిపోతుండగా వాహనం ఢీకొని అతడు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని బోయిసర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాయి కృష్ణ యాదవ్, నేహా మోహటో గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. సరావలి ప్రాంతంలో టిమా ఆస్పత్రి ఎదుట యాదవ్, నేహా ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో యాదవ్ గన్ తీసి బ్లాక్ పాయింట్‌లో ఆమెను కాల్చాడు. ఆమె కుప్పకూలిపోవడంతో వెంటనే అతడు పారిపోయాడు. ఘటనా స్థలం నుంచి 500 మీటర్లు పారిపోయిన తరువాత వాహనం ఢీకొని అతడు అక్కడికక్కడే చనిపోయాడు. వాహనం ముందు దూకడంతో చక్రాల కింద నలిగి అతడు చనిపోయాడని వెహికల్ డ్రైవర్ తెలిపాడు. ఆమె కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కూతురు సంవత్సరం నుంచి యాదవ్‌తో డేటింగ్ చేస్తుందని నెహా తల్లి చెప్పింది.