Wednesday, January 22, 2025

నిధులు గోల్‌మాల్‌.. సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన యువకుడు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా మోట్ల తండాలో బిఆర్ఎస్ సర్పంచ్ ను ఓ యువకుడు చెప్పుతో కొట్టాడు. గ్రామంలో అభివృద్ధి నిధులను గోల్ మాల్ చేశారని సర్పంచ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సర్పంచ్ తో మహేష్ అనే యువకుడు బుధవారం వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. అదికాస్త పెరగడంతో కోపోద్రిక్తుడైన యువకుడు సర్పంచ్ పై చెప్పుతో దాడి చేశాడు. సర్పంచ్ గా చేస్తున్న మంచిపనులు చూసి ఓర్వలేకే తనపై దాడి చేశారని సర్పంచ్ సుమన్ నాయక్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News