Friday, December 20, 2024

స్నేహితుడి గొంతు కోసి..రక్తం తాగిన వ్యక్తి ఆరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నందుకు తన స్నేహితుడినే కత్తితో గొంతును పొడిచి రక్తం తాగిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 19న జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందిఉతడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి 32 ఏళ్ల విజయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయ్ కుటుంబం 30 ఏళ్ల క్రితం కర్నాటకలోని చింతామణిలో స్థిరపడింది. మండ్యంపేటలో వ్యాపారం చేసే విజయ్‌కు సరకులను రవాణా చేసే టాటా ఏస్ వాహనం ఉన్న మారేష్‌తో పరిచయం ఏర్పడింది. విజయ్‌కు అవసరమైన సరకులను మారేష్ తన వాహనంలో రవాణా చేసేవాడు. కొద్ది రోజులుగా విజయ్ భార్యతో 30 ఏళ్ల వయసున్న మారేష్ సన్నిహితంగా మెలుగుతున్నాడు. వారిద్దరూ గంటలకొద్దీ ఫోన్ సంభాషణ సాగిస్తున్నారు. ఇది తెలిసి విజయ్ మారేష్‌ను వారించాడు. తన భార్యకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. అయిఏప్పటికీ మారేష్‌లో మార్పురాలేదు. దీంతో విజయ్ ఒకరోజు డిగ్రీ చదువుతున్న తన కజిన్ జాన్ బాబును పిలిపించాడు. సరకు రవాణా కోసం మారేష్‌ను వాహనంతో రావాలని బాబు చేత కబురుచేయించాడు. వాహనంతోసహా వచ్చిన మారేష్‌ను టమాటా రవాణా చేయాల్సి ఉంటుందని దగ్గరలో ఉన్న పొలం వద్దకు వెళదామని మారేష్‌కు చెప్పి టూవీలర్‌లో ముగ్గురూ బయల్దేరారు.

సిద్దేపల్లి క్రాస్ వద్దకు రాగానే ఒక నిర్జన ప్రదేశంలో బండిని ఆపి మారేష్‌ను కిందకు దింపి అతడి మెడపై కత్తితో విజయ్ పొడిచాడు. కారుతున్న రక్తాన్ని విజయ్ తాగుతుండగా ఆ దృశ్యాన్ని జాన్ బాబు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అయితే సకాలంలో వైద్య చికిత్స అందడంతో మారేష్ ప్రాణం దక్కించుకున్నాడు. మారేష్ పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విజయ్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న జాన్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News